Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ
నవతెలంగాణ-మహబూబాబాద్
కేజీకేఎస్ రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా అక్టోబర్ 19న యాదగిరిగుట్టలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్‌లో సంబంధిత పోస్టర్ ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. గీతకార్మికులకు గీతన్నబంధు ప్రకటించి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించాలన్నారు. వత్తికి ఉపయోగపడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల గీత కుటుంబాలు వారి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలన్నారు. సొసైటీలకు భూమి, కల్లు కు మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు. పెన్షన్ రూ.5 వేలకు, ఎక్స్‌గ్రేషియా రూ.10లక్షలకు పెంచాలని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని కోరారు. తదితర 25 డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ చేపట్టే సభకు వేలాదిగా తరలి రావాలని కోరారు. 20, 21వ తేదీలలో రాష్ట్ర మూడవ మహాసభ నిర్వహిస్తున్నామని , సంఘం అన్ని జిల్లాల నాయకులు, ప్రతినిధులు వెయ్యి మంది హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యమ గాని వెంకన్న, గౌని వెంకన్న, బబ్బూరి ఉప్పలయ్య, పానుగంటి వీరస్వామి, మేడ వెంకటేశ్వర్లు, గునిగంటి మోహన్, డీకొండ మధు, నల్లమాస శ్రీనివాస్, శీలం సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఓరుగంటి వెంకన్న ముంజాల వీరస్వామి, నాగేశ్వరరావు, రెడ్డిమల్ల శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.