Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతిని మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాను గంటి నరసయ్య మాట్లాడారు. ఓంకార్ గారు 1924 సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరి గ్రామంలో మద్ద చిన్నప్పటినుండి కమ్యూనిస్టు ఉద్య మాలకు ఆకర్షితులై పార్టీలో చేరారన్నారు. నాటి నైజాం పాలనలో భూస్వాములు దొరలు దేశ్ముఖులు ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో వెట్టి చాకిరి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఘనత ఆయనదన్నారు ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసి గిరిజనుల హక్కుల కోసం చట్టస భలలో, బయట అనేక ఆందోళన కార్యక్రమం చేపట్టి వేలాది ఎకరాలు పోడు భూములను పేదలకు పంచిపెట్టిన వీర యోధుడని అన్నారు. మహబూబాద్ జిల్లా సహాయ కార్యద ర్శి నూకల ఉపేందర్, గూడూరు మండల కార్యదర్శి బంధాల వీరస్వామి, నాయకులు బానోతులాలు, అర్కాల స్వామి తదితరులు పాల్గొన్నారు
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండల కేంద్రంలో ఎంసీపీఐయూ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఎంసీపీఐయూ వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ 14వ వర్ధంతి ని సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. మహ బూబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పాల్గొని మాట్లాడారు. మండల కార్యదర్శి ఎస్కే సలీం, జిల్లా కమిటీ సభ్యులు వెన్ను ఎల్లయ్య, జాటోత్ బిచ్చా నాయక్ ,ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల నాయకులు వేల్పుల వెంకన్న, సముద్రాల మల్లయ్య, కనుకుల రాంబాబు ,నేరడి వీరస్వామి, తూలయాకయ్య తదితరులు పాల్గొన్నారు.