Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్
నవతెలంగాణ-పాలకుర్తి
హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం నుండి పిసిసి సభ్యుడు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జంగా, లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.