Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీ ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జి, పీసీసీ సభ్యురాలు సింగపురం ఇందిర ధీమా వ్యక్తం చేశారు. సోమ వారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసిసి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. గతంలో వారి తండ్రి గోవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి కి గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు.