Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మిర్చి పంటలో రైతులు మేలైన యాజమాన్య పద్దతులతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సూచించారు. మండల పరిధి పూమ్యతండా గ్రామంలో సోమవారం మిర్చి పంటలను రైతులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. మిర్చిలో రసం పీల్చే పురుగుల తాకిడికి వైరస్ వ్యాప్తి జరుగుతుందని వీటి నివారణకు రసాయన మందుల పిచికారీతో పాటు జిగురు పూసిన పసుపు రంగు, నీలి రంగు, తెలుపు రంగు పూసిన అట్ట లను ఎకరానికి 20-30 పెట్టుకోవాలని సూచించారు. చేను చుట్టూ మూడు వరుసల జొన్న, మొక్క జొన్న విత్తు కోవాలని అన్నారు. దీంతో పంటలను పురుగులు ఆశించకుండా ఉంటాయన్నారు. వేరుకుళ్లు,ఎండు తెగులు రాకుండా ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ అనే శీలింధ్ర నాశనాలను సేంద్రియ ఎరువులలో కలిపి మొక్కల మొదళ్లలో చల్లాలని సూచించారు. సూచనలు, సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. ఏఈఓ నాగరాజు తదితరులు ఉన్నారు.