Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
పచ్చని పల్లెల్లో మతం పేరుతో చిచ్చు పెడుతున్న బీజేపీని దేశం నుండి తరిమికొట్టడం టీిఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం మునుగోడు నియోజ కవర్గంలోని నామాపురం, కొట్టల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కనుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలే టీిఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు. మాజీ మంత్రి మోత్కపల్లి నర్సింలు, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు రమేష్‌యాదవ్, శివకుమార్ గుప్తా, బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్గొన్నారు.