Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రెండు వేర్వేరు సంఘటనల్లో ఎన్ఐ అధికారి పేరుతో బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఎన్ఐఎ అధికారితోపాటు మరో ఇద్దరు దారి దోపిడీ దొంగలను సోమవారం కెయు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుం డి ఆర్మీ యూనిఫారం, ల్యాప్‌టాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్వి చక్ర వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా అది సర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. ఇదే సమయంలో జల్సాలకు అల వాటు పడి డబ్బులు సులభంగా సంపాదించడానికి ఆర్మీ యూనిఫామ్, ఏయిర్ పిస్తోల్ కొనుగోలు చేయడంతోపాటు నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకొని గ్రామంలో ఆర్మీలో పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. నిందితుడు తన స్వగ్రామంలోని చదువుకున్న యువతకు మర్చంట్ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఐదుగురు నుండి రూ.5 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేసి వారిని శిక్షణ పేరుతో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరీర్ ఫౌండేషన్‌లో చేర్పిం చాడు. తాము మోసపోయామని గుర్తించిన సదరు ఐదుగురు యువకులు నింది తుడి తల్లిదండ్రులను నిలదీయడంతో తమ కొడుకు చేతిలో మోసపోయిన యువ కులకు డబ్బు తిరిగి అందచేశారు. నిందితుడిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు, ఇటీవల ఎన్ఐఎ దర్యాప్తు సంస్థ దేశంలో పిఎఫ్ఐతో సంబంధం వున్న వ్యక్తుల ఇండ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా నిందితుడు వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కావడంతో నిందితుడు మరోమారు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు నకిలీ ఎన్ఐఎ అధికారి పేరుతో మరో ఇద్దరు యువకులైన నేలపట్ల రాజేశ్, వినరుబాబులను పరిచయం చేసుకొని వారికి ఎన్ఐఎలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారితో కలిసి నిందితుడు కెయుసి పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పిఎఫ్ఐతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఏయిర్ పిస్తోల్‌తో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వని పక్షంలో జైలుకు పంపిస్తామని బెదిరించిన సంఘటనలో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడిని పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ రోజు కెయు పోలీసులు కెయు మొదటి గేటు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు ద్విచక్ర వాహనంపై అనుమానస్పదంగా వస్తుండగా పోలీసులు నిందితుడిని ఆపి అతని వద్ద వున్న బ్యాగు తనిఖీ చేయగా దానిలో ఆర్మీ యూనిఫామ్, ఏయిర్ పిస్తోల్‌ను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నిందితుడు తాను చేసిన నేరాలను అంగీకరించాడు. గతంలో జగిత్యాల జిల్లాలోను ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు.
ఇద్దరు దొంగల అరెస్ట్
ఇద్దరు దారి దోపిడి దొంగలను కెయు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 20 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, రూ.3 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన గండికోట వెంకన్న, కంది అబ్బులు ఇద్దరు స్నేహితులు సులభంగా డబ్బు సంపాదించాల నుకున్నారు. నిందితులు ఈనెల 13వ తేదీన ఔటర్ రింగ్ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడిని చంపుతామని బెదిరించి మెడలోని బం గారు ఆభరణాలు, రూ.3 వేల నగదుతోపాటు బలవంతంగా ఫోన్ పే ద్వారా మరో రూ.3 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. కెయు పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం రింగ్‌రోడ్డు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితులు పాల్పడిన నేరాన్ని అంగీకరించారు. ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డిసిపి అశోక్‌కుమార్, హన్మకొండ ఎసిపి కిరణ్‌కుమార్, కేయూ సీఐ దయాకర్, ఎస్సైలు సతీష్, విజయ్‌కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు నర్సింగరావు, పాషా, సంపత్ సిబ్బందిని సీపీ అభినందించారు.