Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో ఉండే ప్రగాఢ విశ్వాసం వారి నమ్మకమే
- డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత
- సీరోల్ మండల కేంద్రము లో రెవెన్యూ కార్యాలయాల ప్రారంభోత్సవం
నవతెలంగాణ - డోర్నకల్/కురవి
నూతనంగా ఏర్పడిన సీరోల్ మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగా వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ఎంపీ మాళోత్ కవిత, మహబుబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక హాజరు కాగా వారికి మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు హంస లాంటి వారని అన్నారు. తన నాయకత్వాన్ని విశ్వసించి గెలిపించిన ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరించారు. ప్రజల్లో విశ్వసనీయత లేని నాయకుడికి మనుగడ ఉండదని, మనుగడలేని నాయకులకు ప్రజాక్షేత్రంలో స్థానం లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ వెంకట్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఓడినా గెలిచినా, రెడ్యానాయక్ చేసిన తప్ప మరే నాయకులు అభివద్ధి చేయలేదన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మండల ఏర్పాటుతో ప్రజలకు మరింత అభివద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ సాధ్యమవుతుందన్నారు. యువనేత రవి చంద్ర మాట్లాడుతూ... డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు కోరిన కోరికలు రెడ్యా నాయక్ అనుకుంటే ఏదైనా సాధిస్తారని, ఇది ప్రజల్లో ఉండే ప్రగాఢ విశ్వాసం అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలతో నియోజకవర్గ ప్రజల రుణం ఎమ్మెల్యే రెడ్యా తీర్చుకు న్నారన్నారన్నారు. బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవినాయక్, సీరోల్ ఎంపీటీసీ భోజ్యనాయక్ మాట్లాడుతూ తనకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చి ప్రజాప్రతినిధిని చేసిన ఘనత రెడ్యానాయక్దేనని అన్నారు. స్థానిక సర్పంచ్ శ్యామల రంగమ్మ మాటా ్లడుతూ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు రుణ పడి ఉంటామని అన్నారు. అందరూ రెడ్యాకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్, కురవి ,సీరోల్ మండల ఎంపీపీలు గుగులోత్ పద్మావతి రవినాయక్, బాలు నాయక్, జెడ్పీటీసీ కమల రామనాథం, వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్యయాదవ్, పీఏసీఎస్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ దొడ్డ గోవర్థన్ రెడ్డి, కొండపల్లి శ్రీదేవి, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంక్ డోత్ వీరన్న, వైస్ చైర్మెన్ కోటి లింగం, డోర్నకల్ మండల అధ్యక్షులు నున్న రమణ, గాడిపల్లి రాములు,విద్యాసాగర్, తోట రమేష్, పెద్ది వెంకన్న, టీిఆర్ఎస్ యువ నాయకులు రవిచంద్రనాయక్, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జురి ఉమాపిచ్చిరెడ్డి, స్థానిక మండల పరిషత్ చైర్మన్ పద్మావతిరవినాయక్, ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.