Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
దొరల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు చాలా నాటికలతో కళాకారులు ప్రజలోకి తీసుకెల్లి దొరల వెట్టిచాకిరి నుండి ప్రజలు విడిపించి దున్నేవాడిదే భూమి కావాలని, ఎర్ర జెండా వర్ధిల్లాలని, పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం నింపిన ఘనత వీధి నాటకాలవి అని ప్రజానాట్య మండలి రాష్ట్ర సీనియర్ నాయకులు కే శాంతారావు అన్నారు. జిల్లా ప్రజా నాట్యమండలి వీధినాటిక మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని సోమవారం ఉర్సుగుట్ట సీపీఎం పార్టీ కార్యాలయంలో దాసరపు అనిల్ అధ్యక్షతన జరిగిన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రజా నాట్యమండలి జ్లిల్లా సీనియర్ నాయకులు డౌలత్ రవితో కలిసి ప్రజానాట్య మండలి జెండా ఎగురవేశారు. శిక్షణ శిబిరాన్ని ఉద్యేశించి ఆయన మాట్లా డుతూ ప్రజా తిరుగుబాటు పోరాటం లో కొమురయ్య ని కాల్చి చంపాగా అప్పుడు ప్రజలు తిరగబాడీ పోరాటాలు చేశారన్నారు. అందులో నాటకాల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు. మత సమసమరస్యంపై కూడా పోరాడింది కమ్యూనిస్టులు అని అందుకే భారతదేశంలో అద్భుతమైన చరిత్ర కలిగిన పాత్రను కమ్యూనిస్టులు సష్టించారని అన్నారు. అదే స్ఫూర్తితో నేడు మన మనందరం కలసి కొత్త నాటకాలు సష్టించి తెలంగాణ నాటకం 2 పేరుతో ప్రజల్లోకి అనేక నాటకాలు తీసుకెళ్లాలి అని కళాకారులకు పిలుపునిచ్చారు. సిపిఎం రంగశాయిపేట ఏరియా కార్యదర్శి ఎం.సాగర్ మాట్లాడుతూ ఈ మూడు రోజులు శిక్షణలో అందరూ క్రమశిక్షణతో ఉంటూ నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రజా నాట్యమండలి కార్యదర్శి దుర్గయ్య, సోషల్ మీడియా కార్యదర్శి జి.చందు, ఏస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రజా నాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.