Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వేణుగోపాల్,
- జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఇన్చార్జి డాక్టర్ సుధాకర్
నవతెలంగాణ-తొర్రూరు
ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వేణుగోపాల్, జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఇన్చార్జి డాక్టర్ వింజమూరి సుధాకర్ హెచ్చరించారు. సోమవారం తొర్రూరు పురపాలక సం ఘం పరిది హౌటల్లు, బేకరీలు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఆదే శాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హౌటల్ యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, నాసి రకం వస్తువులు వాడరాదని, క్వాలిటీ ఫుడ్ ప్రజలకు అందించాలని తెలిపారు. పలు ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇకముందు కూడా వరుస తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పలు దాబాల్లో వంటగదిలో శుభ్రంగా లేవని, తిను బండారాలపై మూతలు లేవని, నాణ్యత పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మూడు హౌటళ్ల శాంపిల్స్ సేకరించామని వీటిని ల్యాబ్ కు పంపిస్తామని, వచ్చిన రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.