Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీలను అడ్డగించిన కాచికల్ గ్రామస్తులు
నవతెలంగాణ-నెల్లికుదురు
మా కాచికల్ గ్రామం మీదుగా బండరాళ్ల లారీలను పోనివ్వమని సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు రాజేశ్వరరావు, గీత, మన్మోహన్రెడ్డి, లచ్చయ్య, గీత, రవీందర్ రెడ్డి, వేటాస్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రామం మీదుగా వెళ్తున్న ఓవర్ లోడ్ లారీలను అడ్డగించి నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎర్రబెల్లి గూడెంకు చెందిన మిడ్ వేస్టర్ క్వారీ నుండి గ్రానైట్ బండ లారీలు రోజురోజుకు అంతే లేకుండా వెళ్తున్నాయని, ప్రభుత్వం వేసిన రోడ్డు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారుర. వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని, కొంతమంది వాహనాలు దెబ్బతిన్న రోడ్లలో పడి పలువురికి గాయాలైన ఘటనలున్నాయని వాపోయారు. పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు వాహనాలు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో విద్య వైద్యానికి కూడా దూరమవుతున్న దుస్థితి నెలకొందన్నారు. లారీలు అధికంగా లోడుతో వెళ్తుండడంతో రోడ్డు బొందలమయంగా మారిందని అన్నారు. ఈ వర్షాకాలంలో అబ్బో నీరు నిలిచి ఆ గుంట ఎంత లోతులో ఉందో నాకు తెలియలేక అనేక వాహనాలు దిగబడి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. లారీల రాకపోకలతో దుమ్ము, ధూలి ఇండ్లలోకి చేరి ఇబ్బందుల పాలవుతున్నామని అన్నారు. రాత్రి అయిందంటే లారీల సౌండ్ కు రోడ్డు వెంబడి ఉన్న ఇండ్ల వాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. పలుమార్లు ఓవర్లోడ్ లారీలను అడ్డుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఓవర్ లోడ్ లారీల రాకపోకలు నిలివేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ ఘటనాస్థలికి చేరుకొని మేడ్ మిస్టర్ గ్రానైట్ యజమాన్యంతో మాట్లాడి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. కాగా వారు స్పందించి మరమ్మతులు చేపడతామని హామీనివ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రెడ్డబోయిన అశోక్ జాల సోమేశ్వర్ రెడ్డబోయిన సతీష్ దర్గయ్య తోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.