Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్న రొనాల్డో రాస్
- విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అధికారులు
నవతెలంగాణ-కాజీపేట
మండలంలోని మడికొండ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల బాలికల పాఠశాల, కళాశాలను సోమవారం గురుకులాల కార్యదర్శి రోనాల్డో రాస్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హను మంతు, నగర మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, ఐటిడిఎ పిఓ అంకిత్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. వరంగల్ ఆర్సిఓ, పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బందం స్వాగతం పలికారు. అనంతరం వారు 9వ తరగతిని సందర్శించి విద్యార్థుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. 5వ తరగతి విద్యార్థులతో మాట్లాడి లైబ్రరీలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీకి సంబంధించి పలు రకాల పుస్తకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇగ్నైట్ పాఠశాల స్థాయి పోటీలలో భాగంగా ఆల్ గో రిథమ్ పుస్తక సమీక్షను పరిశీలించారు. వంటశాల గదిని సందర్శించి విద్యార్థులకు అందించే ఆహార విధానాన్ని అడిగి తెలుసుకుని, జూడో విద్యార్థుల ఆట విధానాన్ని క్రీడల్లో మెలకువలను తెలుసుకున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు అర్చన, గంగోత్రి, ఆల్ ఇండియా ఖేలో ఇండియా జూడో ఛాంపియన్షిప్, నేషనల్ ర్యాంకింగ్ టోర్న మెంట్లో పాల్గొననున్న ముగ్గురు విద్యార్థులను అభినందించి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా తీర్చిదిద్దరం జరుగుతుం దన్నారు. పాఠశాలలో ఆకస్మిక సందర్శన చేసి విద్యార్థుల సౌకర్యాలు, ఆహారం, విద్యార్థులు కలిగే ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.