Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆస్పత్రిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని సీపీఐ(ఎం) హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. సోమవారం అంబేద్కర్ సెంటర్లో ఎంజీఎం హాస్పిటల్లో వైద్య, పారి శుద్ధ్య సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ పెద్దాసుపత్రి మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి అన్నారు. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని విమర్శించారు. నిమ్స్ స్థాయిలో ఎంజీఎంను అభివద్ధి పరుస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. ఎంజీఎం అభివద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా మని ప్రభుత్వం చెప్పు కుంటున్న అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. పారిశుద్ధ్య సమస్యలతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో పేరుకే వెయ్యి పడకలు. సీజనల్ వ్యాధులస్తే ఒకే మంచంలో ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి వైద్యులు చికిత్స అందించాల్సి వస్తోందన్నారు. చాలా మంది రోగులు కింద పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. వెయ్యి పడకల్లో పనికి రాని మంచాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రోగులకు అందించే బెడ్షీట్ల కొరత కూడా తీవ్ర స్థాయిలో ఉందన్నారు. ఎంజీఎంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని త్వరి తగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు అల కుంట్ల యకయ్య, దూడపాక రాజేందర్, నోముల కిషోర్, ఎన్నాము వెంకటేశ్వర్లు, కంచర్ల కుమరస్వామి, పల్లకొండ శ్రీకాంత్, మోతె సతీష్, మాచర్ల సతీష్, చందర్, కావ్య, సంపత్, రాజు, సురేష్, రాణి, రమ, విజయ, విజేందర్, తదితరులు పాల్గొన్నారు.