Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
- ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల
- సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం
నవతెలంగాణ-చెన్నారావుపేట
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 92 వేల మంది పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యను నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చెన్నారావుపేట-నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం వద్ద వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగ తుల విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ 284 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలను, జూనియర్, డిగ్రీ కళాశాలలను స్థాపించామన్నారు. బీసి విద్యార్థుల విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్ స్కిప్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ వారి విద్యాభివద్ధికి తోడ్పడుతుందన్నారు. ఉద్యమ కారుడు, యువకుడు, మేమందరం ముద్దుగా పిలుచుకునే పెద్దన్న నర్సంపేట ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదష్టం అన్నారు. ఎమ్మెల్యే చొరవతో అదనంగా మరొక బిసి గురుకులాన్ని మీ నియోజకవర్గానికి ఇచ్చామని, బిసిల సంక్షేమం కోసం, కుల వత్తుల నైపుణ్యాభివద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి ఏటా నిధులను కేటా యిస్తుంది అన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గ విద్యాభివద్ధికి కషి చేస్తానని తెలిపారు. నూతరన బస్ షెల్టర్‌ను నిర్మాణాన్ని చేపట్టిన ఫౌండేషన్ చైర్మన్ వేములపల్లి రాజుకి మంత్రి గంగుల, ఎమ్మెల్యే పెద్దిలు అభినందనలు తెలిపారు. అనంతరం చెన్నారావుపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన వివేకానందుని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, జెడ్పిటిసి, ఎంపీపీ, వైస్ ఎంపిపి కంది కష్ణారెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, కుండె మల్లయ్య, ననుమాస కరుణా కర్, బాబు, ఓరుగంటి సంతోష్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.