Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
మండలంలోని తాటికొండ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మారపాక రాజు కూతురు జ్యోతిక హైదరాబాద్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేసుకుని, కలకత్తా నగరం విశ్వ భారతి యూనివర్సిటీలో ర్యాంక్ సాధించింది. కాగా ఆర్థిక స్థోమత సరిగా లేదని గమనించిన వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి రూ.10వేలు ఆర్థిక సాయం సోమవారం అందించారు. ఉన్నత స్థానం సంపాదించి, గ్రామానికి, తల్లిదండ్రులకు సమాజానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.