Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిన్నగూడూరు
రెక్కల కష్టం మీద ఆధారపడిన వ్యవసాయ కార్మి కులకు సమగ్ర చట్టం చేయాలని వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు. సోమ వారం మండలంలోని గుండంరాజుపల్లిలో మండల మహాసభ జక్కుల లింగన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ వ్యవసాయం యాంత్రీకరణ, పంటల్లో వచ్చిన మార్పుల వల్ల వ్యవసాయ ఆధారిత పనులు తగ్గిపోతున్నాయన్నారు. పార్లమెంట్లో వామపక్షాలు చేసిన పోరాట ఫలితంగా అనేక సంక్షేమ చట్టాలు, పథకాలు వచ్చాయని, నేడు మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. వ్యవసాయ కార్మికులకు సొంత స్థలంలో ఇంటి నిర్మా ణానికి రూ.5లక్షలు ఇవ్వాలని కోరారు. కూలి పెంచి భూమి పంచాలని, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. దళితులందరికీ దళితబంధు ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా నాయకులు గునిగంటి మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న, వల్లపు పద్మ, రాంబా యమ్మ, గంగరబోయిన మంగమ్మ, పొన్నం మాధవి, పూత రాజు, మల్లమ్మ, చిర్ర కమలమ్మ, గునిగంటి ఉపేంద్ర, కుర్ర జయమ్మ, ఉపేంద్ర, సారమ్మ, సారమ్మ, తదితరులు పాల్గొన్నారు.