Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీ కేఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగన్న గౌడ్
నవతెలంగాణ-పాలకుర్తి
ఈనెల 20,21 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే కేజీకేఎస్ రాష్ట్ర మహాసభల సందర్భంగా 19న జరిగే బహిరంగ సభను గీతా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కేజీ కేఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్మగాని నాగన్న గౌడ్ గీతా కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన గీతా కార్మికుల సమావేశానికి కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కమ్మగాని రమేష్ గౌడ్ తో కలిసి ఆయన పాల్గొని మాటాడారు. కేజీ కేఎస్ రాష్ట్ర మహాసభల్లో గత పోరాటాలపై సమీక్షించి భవిష్యత్తు కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుం టారని తెలిపారు. 19న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నా రు. గీత కార్మికుల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చేందుకు ప్రభుత్వం జిల్లా కేంద్రాలతో పాటు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో నీరా ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌడ కార్పొరేషన్‌కు బడ్జెట్లో నిధులు కేటాయించాలని అన్నారు. యాదగిరిగుట్టలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీ కేఎస్ మండల అధ్యక్షుడు మూల మహేష్ గౌడ్, కేజీ కేఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కమ్మగాని వెంకటేష్ గౌడ్, కేజీ కేఎస్ మండల నాయకులు గిరగాని కుమారస్వామి గౌడ్, మల్లంపల్లి సొసైటీ అధ్యక్షుడు కోతి ఐలయ్య గౌడ్, గర్వందుల వెంకన్న గౌడ్, మెరుగు శ్రీనివాస్, గర్వందులవీరస్వామి గౌడ్, పరుశరాములు గౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.