Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నరసింహులపేట
నర్సింహులపేట మండలానికి సంబంధించిన గురుకులాన్ని తక్షణమే మరిపెడ నుండి నర్సింహులపేటకు మార్చాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు డిమాండ్. ఎస్ఎఫ్ఐ నర్సింహులపేట మండల కమిటీ ఆద్వర్యంలో స్థానిక తాసిల్దార్ ఆఫీసు ఎదుట సోమ వారం ధర్నా నిర్వహించి, ఏఎస్ఓ కిరణ్కు వినతిపత్రం అందజేసి మధు మాట్లాడారు. గురుకులం నర్సింహులపేట మండలానికి మంజూరు చేసి ఏండ్లు గడుస్తున్న ఇప్పటి వరకు నర్సింహులపేటకు మార్చక పోవడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ విద్యా సంస్థలు లేకపోవడంతో మండల అభివద్ధి ఎలా చెందుతుందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు గురుకులాన్ని నర్సింహులపేటకు మార్చడం కోసం కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, అఖిల్ , యశ్వంత్, నవీన్, ప్రవీణ్, మహేష్ పాల్గొన్నారు.