Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హసన్పర్తిలో ప్రదాని చితప్రటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-హసన్పర్తి
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్యాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చితప్రటానికి హసన్పర్తి బస్టాండులో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు మారపెల్లి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ.6వేలు అంది స్తోందని, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిందని ఇప్పటికీ రైతులకు 11 విడతలుగా 22వేలు వచ్చాయని తెలిపారు. రైతుల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నిరంతరం నిబద్ధతతో ఉన్నారన్నారు. 12వ విడత మొత్తాన్ని 8.5 కోట్లమందికి పైగా మోదీ కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.16వేల కోట్లను విడుదల చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన రైతు కుటుంబాలకి రూ.6వేలు సంవత్సరానికి 1ఎకరానకి 3 విడ తల్లో రూ.2వేల చొప్పున రైతు ఖాతాలో రూ.6వేలు జమ అవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్, కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు పెద్ది మహేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు కడిపికొండ పట్టాభి రెడ్డి, 66వ డివిజన్ అధ్యక్షులు మేకల హరి శంకర్, ప్రధాన కార్యదర్శి తంగలపల్లి రమే ష్, బండారి శేఖర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్య దర్శి తాళ్ల శ్యామ్ సుందర్, డివిజన్ కార్యదర్శులు ఇమ్మడి కరుణాకర్, వెలుగటి తిరుపతిరెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు ఆకుతోట సాంబయ్య, గంట సత్యం, పోతరాజు ప్రభాకర్, బీజేపీ నాయకులు ఆలేటి సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.