Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు
నవతెలంగాణ-హసన్‌పర్తి
సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివ రావు వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం డాక్టర్ బి.సాంబశివరావు వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిని, రికార్డులను తనిఖీ చేశారు. నూతనంగా నిర్మించిన సమావేశ గదిని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరును, రోజువారి రోగుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, అవసరమైన నాల్గవ తరగతి ఉద్యోగుల వివరాలను రిపోర్టు చేయాలని వైద్యాధికారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. ప్రసవాలు పూర్తిగా ఆస్పత్రిలోనే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువగా జరిగేటట్లు ప్రోత్సహించాలన్నారు. పల్లె దవాఖా నాల్లో వైద్యాధికారులు అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో సేవలు అందించాలన్నారు. ఉప కేంద్రంలో ఓపి, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల క్యాంప్‌లను క్రమంగా పెంచి, వ్యాధి నిర్ధారణ అయితే ప్రత్యక్ష పర్యవేక్ష్షణలో మందులను వాడించాలన్నారు. రోగుల ను క్రమం తప్పకుండా ఫాలో అప్ చేయాలని, దోమలు పుట్ట కుండా ప్రతి శక్రవారం డ్రై డే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అదే విధంగా దోమలు కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రతల పైన ప్రజల లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఉప వై ద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాకూబ్ పాషా మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణి స్త్రీలను గుర్తించి భవిష్యత్‌లో వచ్చే కాంప్లికేషన్ నివారించాలన్నారు. గర్భిణీలకు ఐరన్ ఫోలి క్ ఆసిడ్ మాత్రలు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. ఐసీడీ ఎస్ సిబ్బంది సహకారంతో పిల్లలలో ఎదుగుదలను మానిట రింగ్ చేయాలన్నారు. యన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టరు ఉమశ్రీ డీ యస్ ఓ డాక్టర్ వాణిశ్రీ, తమ తమ కార్యక్రమాల పైన సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో మాస్ మీడి యా అధికారి అశోక్ రెడ్డి, పల్లె దవఖానా డాక్టర్లు, మాధవ రెడ్డి, పిహెచ్ఎన్ స్వర్ణలత, భగవాన్ రెడ్డి, పీహెచ్ఎన్ స్వర్ణల త, ఫార్మసిస్టు అజిత, ఉమ, రాజు కుమార్, సిబ్బంది కందు కూరి సంతోష్‌కుమార్, స్వప్న, రేణుక, సునిత, ఇంద్రారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.