Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల అవస్థలు పట్టని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు, అధికారులు
నవతెలంగాణ-వేలేరు
భీమదేవరపల్లి, వేలేరు మండలాలను కలిపే వేలేరు-కొత్తకొండ ప్రధాన రహదారి గుంతలు గుంతలుగా తయారై ప్ర0యాణికులకు, వ్యవసాయ కూలీకు, రైతులకు ఇబ్బం దులకు గురిచేస్తుంది. నిత్యం అటువైపు వెళ్ళే వాహన దారులు తమ వాహనాలు గుంతలరోడ్డులతో మరమ్మ తులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలే రు గ్రామస్థుల వ్యవసాయభూములు ఈ రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్నాయి. అత్యవసర వైద్యం కోసం ప్రైవేట్ వాహనాల్లో ముల్కనూర్కు వెళ్తుంటారు. కరీంనగర్, వేము లవాడ వెళ్లే వేలేరు మండల ప్రజలు ఇదే మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. తెలంగాణాలో ప్రతిష్టాత్మకమైన దేవాలయాల్లో కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం ఒకటి. నిత్యం ప్రజలు ఈ దేవాలయానికి వచ్చి పూజలు, మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంక్రాంతికి దేవాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. దశాబ్దాలుగా జాతర ముందు మట్టితో గుంతలను పూడ్చి మమా అనిపించడం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అలవాటుగా మారింది. బ్రహ్మోత్సవాలకు ఇంకా రెండు నెలల మాత్రమే ఉంది. ఈ సారైనా నాణ్యమైన బిటి రోడ్డు నిర్మించాలని ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు. ఇట్టి రోడ్డు సగభాగం స్టేషన్ ఘన పూర్ నియోజక వర్గంలో మిగతా సగభాగం హుస్నాబాద్ నియోజకవర్గ పరిథిలో ఉంది. స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా డాక్టర్ టి.రాజయ్య, హుస్నాబాద్ ఎమ్మె ల్యేగా వొడితెల సతీశ్ కుమార్ పలుమార్లు ఎన్నికయ్యారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు మంది మార్బలంతో హాజరవుతుంటారు. కానీ అధ్వాన్నంగా ఉన్న 4 కిలోమీటర్ల రోడ్డు పట్టింపు లేకపోవడంపై ప్రజలు బాహా టంగానే విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఎమ్మె ల్యేలు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకొని నాణ్యత ఉన్న రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి
- ముడపు రాజు, ఆటో కార్మికుడు
వేలేరు-కొత్తకొండ ప్రధాన రహ దారిపై అడుగ డుగునా గుంతలతో దర్శన మిస్తున్నాయి. ప్రయాణానికి ఇబ్బం దిగా ఉంది. రెండు నియోజక మ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకొని గుంతలు లేని నిర్మాణం చేపట్టాలి.
వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నాం
- కాయిత క్రిష్ణారెడ్డి, రైతు
మాతోపాటు చాలా మంది ప్రజ ల వ్యవసాయ భూములు ఇటు వైపే ఉన్నాయి. పనులకు వెళ్లాలంటే అధ్వా న్న మైన రోడ్డుతో వెళ్లలేక పోతున్నాం. రాత్రి పూట ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై ప్రయాణం చేసేవారు. క్రిందపడి గాయాలపాలయ్యారు.