Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్ డాక్టర్ జి.బాబురావు
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రకృతి బీభత్సాలు సంభవించినప్పుడు తక్షణ సహాయం అందిందే సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని లయన్ డాక్టర్ జి.బాబురావు అన్నారు. మండలంలోని ఎర్రగట్టుగుట్ట కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో గ్లోబల్ యాక్షన్ టీం, ఎల్సిఐఎఫ్ టీం సభ్యుల సమ్మేళనం 320ఎఫ్ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వ వ్యాప్తంగా ప్రకృతి బీభత్సాలు ఎక్కడ జరిగినా ఆ ఆపద సమ యంలో తక్షణ సహాయం అందించి ఆదుకోవడంలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎప్పుడు ముం దుంటుందన్నారు. లైన్స్ క్లబ్ ఎల్సిఐఎఫ్ ఫౌండేషన్‌కు మనం ఇచ్చిన విరాళాల కంటే ఆ సంస్థ అధికంగా సేవా కార్యక్రమాలకు వితరణ చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఒక్క లయన్ మెంబర్ ఎల్సి ఐఎఫ్ కు మద్దతు ఇవ్వా లని కోరారు. రూ.60 వేతనంతో ప్రారంభమైన తన జీవితం ఈరోజు 300 మందికి ఉపాధి కలిపి స్తున్న దన్నారు. మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ అంశాలలో 320ఎఫ్ ముం దంజలో ఉందని మెంబర్షిప్ గ్రోత్ ఇదే విధంగా కొనసా గించాలని కోరారు. 316డి జిల్లా మాజీ గవర్నర్ అన్న పరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ సేవలో కానీ వ్యక్తిగత అభివృద్ధిలో కానీ నిర్ణీత లక్ష్యాన్ని పెట్టుకోవాలని అప్పుడే విజయం సాధిస్తారని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గవర్నర్ కన్నా పరశురాములు గ్యాట్ కన్క్లేవ్ ఉద్దేశాలను వివరించారు. కార్యక్రమంలో లయన్స్ ఉప గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి, మాజీ గవర్నర్లు ఆవుల గోపాలరావు, యస్.నరేందర్ రెడ్డి, డాక్టర్ కే.రాజేందర్ రెడ్డి, డాక్టర్ డి.లవకుమార్ రెడ్డి, వివిధ విభాగాల నాయకులు ఎన్.రవీందర్, ఏ. ప్రభాకర రావు, సిహెచ్ .ప్రసాద్, డాక్టర్ దివి అజిత్ కుమార్, ఎన్.సుధాకర్ రెడ్డి, పి.హరికిషన్‌రెడ్డి, డాక్టర్ తాళ్ల రవి, వి.గోపా ల్రావు తదితరులు పాల్గొన్నారు.