Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
నిరుపేద రైతులు, దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కాటారంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ మండలంలోని పో చంపల్లి శివారులో గలా 610 ఎకరాల భూమి 1995 ముందు నుండి కాస్తూ కబ్జాలో ఉన్న మరిపల్లి, దంతేలపల్లి, బొప్పారం గ్రామాల ఆదివాసి, దళిత, నిరు పేద రైతులకు శాశ్వత పరమైన పట్టాలు ఇవ్వాలని కోరారు. అటవీ శాఖ అధికా రుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు శ్రీనివాస్ వినతిపత్రం అందజేయగా సానుకూల స్పందించిన తహశీల్దార్ ఆదివాసీ, దళిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయక పోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గొట్టం భూమయ్య, ప్రధాన కార్యదర్శి గుంటి రమేష్, రామచందర్, రామినేని సురేందర్, రామినేని వెంకటరాజు, పోలం రా జేందర్, బెల్లంకొండ పోచయ్య, మంగయ్య సడవలి, కొత్తపల్లి లక్ష్మిస్వామి, గుంటి లక్ష్మయ్య, కాల్వపల్లి సుధాకర్, దయ్యం వినోద్, పోలం చిన్న రాజేందర్, గాదె రవీందర్, ప్రతాపగిరి ఉప సర్పంచ్ క్రాంతి కుమార్, రైతులు పాల్గొన్నారు.