Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.15.40 లక్షల నిధులు వృథా
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతీ గ్రామంలో నిర్మాణాలు చేపట్టిన స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డ్లు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారయ్యాయి. ఇందుకు నిదర్శమే మండల కేంద్రమైన తాడిచెర్లలో మానేరు ఒడ్డున ప్రమాదకరమైన స్థలంలో స్మశాన వాటిక, సెగ్రిగేషన్షెడ్డు, డంపిం గ్ యార్డ్ నిర్మాణం చేపట్టారు. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు, ఇందుకు తోడుగా మానేరుపై చెక్ డ్యామ్ ల నిర్మాణం, కరీంనగర్ ఎల్ఎండి నీరు వదల డం,కాళేశ్వరం బ్యాక్ నీరు రావడంతో పంట పొలాలు ముంపునకు గురి కావడమే కాక స్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డ్ మునిగిపోయి వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో స్మశాన వాటిక రూ.13 లక్షలు, షెగ్రిగేషన్ షెడ్డు రూ.2.40 లక్షలు, డంపింగ్ యార్డ్ రూ.50వేలు మొత్తం రూ.16 లక్షల ప్రజాసొమ్ము నీటి పాలయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారుల ముందస్తు చూపులేకనే ఇలా లక్షల ప్రజాసొమ్ము నీటిపాలైందని స్థానిక నాయకులు ఉన్న కోడిపుంజల ఓదేలు, రాజు, సమ్మయ్య, సాత్విక్, శివ తదితరులు ఆరోపిస్తున్నారు.
ముందు చూపు లేకనే..
తాడిచెర్ల మానేరు ఒడ్డున ఈజిస్ రూ.15 లక్షల నిధులతో నిర్మాణాలు చేప ట్టిన స్మషాన వాటిక, డంపింగ్ యార్డ్,షెగ్రిగేషన్ షెడ్డు వరద ముంపునకు గురై పూర్తిగా కొట్టుకుపోయాయి.అధికారులు ముందుచూపు లేకనే మున్నాళ్ల ముచ్చ టగా మారి లక్షల సొమ్ము దుర్వినియోగం అయింది. ఈ విషయాన్ని గతంలో పంచాయతీ అధికారులు భూపాలపల్లి జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు దష్టికి తీసుకపోయిన పట్టించుకోకపోవడం గమనార్హం. నిర్మాణ పనులకు మాత్రం 90 శాతం బిల్లులు పేమెంట్ అయినట్లుగా తెలిసింది.ఏది ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉండేలా పెంజర్ కట్టకు స్మశాన వాటిక,సెగ్రిగేషన్ షెడ్డు,డంపింగ్ యార్డ్ లు నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.