Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరలివస్తున్న క్రీడాకారులు
- స్కౌట్ విద్యార్థుల రిహార్సల్స్
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
రాష్ట్ర రాష్ట్రస్థాయి గిరిజన క్రీడాకారులు తెలం గాణ లోని ఐటీడీఏల పరిధిలో ఉన్న గిరిజన విద్యా సంస్థల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున ఏటూరు నాగారం తరలివస్తున్నారు. నేడు (మంగళవారం) ప్రారంభం కానున్న రాష్ట్ర గిరిజన క్రీడలకు కావాల్సి ఏర్పాట్లపై అధికారులు నిమగమై ఉన్నారు. మైద ానంలో జరగనున్న ఆయా క్రీడలకు కోచ్ లు మైదా నాన్ని సిద్ధం చేశారు. అలాగే ప్రారంభోత్సవానికి వచ్చే వీవీఐపీలను, జిల్లా అధికారులను ఆహ్వానించేందుకు స్కౌట్ అండ్ గైడ్స్ రిహార్సల్ చేస్తున్నారు. జరగనున్న క్రీడలకు క్రీడా మైదానాన్ని కోచ్‌లు, పీడీలు, పీఈటీలు ఆటలకు సంబంధించిన కోర్టులను ముగ్గులు పోసి సిద్దం చేస్తున్నారు. ఐటీడీఏ నుంచి క్రీడా మైదానం వరకు క్రీడా జెండాలను ఏర్పాటు చే శారు. అలాగే ఆయా జిల్లాల నుంచి క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు క్రీడా మైదానాన్ని గుర్తించేందుకు అతి పెద్ద బెలూన్ను క్రీడామైదానంలో ఆకాశాన్ని తలపిం చేలా ఏర్పాటు చేశారు.
నేటి నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడలకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌ను నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు, కోచ్‌లు బస్సుల్లో చేరుకుంటున్నారు. వారికి కేటాయించి విడిది రూముల్లో బస చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.