Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేళ్లుగా అధికారాలు అప్పగించని ప్రభుత్వం
- రైతులకు అందని సలహాలు, సూచనలు
నవ తెలంగాణ-మల్హర్రావు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుబంధు సమితిలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేలా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిన విషయం విదితమే. 2018లో ఏర్పాటైనప్పటి నుంచి రైతుబంధు సమితి సభ్యులకు ఎలాంటి బాధ్యతలు, విధులు అప్పగించలేదు. మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో ఒక మండల కోఆర్డినేటర్, గ్రామానికి ఒక కోఆర్డి నేటర్ మొత్తం 16 మందిని నియమించారు. పట్టా భూములున్న రైతులను సమితి సభ్యులుగా నియమించారు. ఈ సమితులకు అన్ని రకాల అధికారాలు కట్టబెడు తుందన్న ప్రచారం జోరుగానే సాగింది. రైతుబంధు పథకం, రైతు బీమా, గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి పని చేస్తారని అధికారులు చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు, క్రాప్ కాలనీల ఏర్పాటు, గిట్టుబాటు ధరలు పెంచి మార్కెట్ ధరలు కల్పిస్తారన్న ప్రచారం చేశారు. అలాగే రూ.500 కోట్లతో రైతునిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. నేటికి అవేమి అమలుకు నోచుకోకపోగా రైతుబంధు సమితిలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలి పోయారు.
కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నాం : ఏవో మహేష్
రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌తో పాటు గ్రామ కోఆర్డినెటర్లను రైతు వేదికల్లో నిర్వహించే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపుతున్నాం.