Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
నగరంలోని పిన్నవారి స్ట్రీట్ ప్రాంతానికి చెందిన కందుల శ్రీనివాస్‌రావు (100) అనారోగ్యంతో మరణించగా ఆయన పార్దివదేహాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం కాకతీయ మెడికల్ కాలేజ్‌కి అప్పగించారు. తెలంగాణ తెలం గాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు కోన్‌రెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు, వైద్య పరిశోధనలకు పార్థివదేహం ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు. సమాజ హితం కోరి శ్రీనివాసరావు మృతద ేహాన్ని అప్పగించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపి, సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో కెఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్లు పద్మావతి, ప్రసన్న సిబ్బంది ప్రేమ్ కుమార్, మోహన్ దాస్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అసోసియేషన్ ప్రతినిధులు ఉపేందర్ రెడ్డి, శంకర్ రావు, రాజేంద్రప్రసాద్, కేదారి, రాజమౌళి, కోటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.