Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న మండల కేంద్రానికి చెందిన మాసు రమేష్‌ని కళా శాల యాజమాన్యం మంగళవారం సన్మానించారు. ఇటీవల హైదరాబాద్‌లోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవరంలో నిర్వహించిన స్పందన ఈద ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ట్రెండ్ కార్యక్రమంలో ప్రతిభ చూపి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి గురు స్పందన పురస్కా రం 2022 ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్, బిసి వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, ఉస్మానియా యూనివర్సిటీ డీన్ మల్లేశం చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మున్ముందు మరెన్నో అవా ర్డులు అందుకొని కళాశాలకు పేరు తీసుకురావాలని కోరారు.
అదేవిధంగా చిట్యాల గ్రామ పంచాయతీకి నూతనంగా ఇన్చార్జి సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న ఆకుల రవిని కళా శాల యాజమాన్య ఘనంగా సత్కారం చేశారు. గ్రామ అభివద్ధికి కళాశాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ ని కోరారు. కార్యక్రమంలో కళాశాల ఇంచార్జిలు నోముల వేణు,చల్ల శ్రీనివాస్ రెడ్డి,దూడపాక సంతోష్, అధ్యాపకులు లోకందర్ రెడ్డి, సాంబయ్య, స్వామి, రేణుక, స్వాతి, సుకన్య, మమత, సిబ్బంది పాల్గొన్నారు.