Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద దసరా ఉత్సవాలకు ప్రభు త్వం కేటాయించిన స్థలాన్ని కాపాడాలని కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ప్రతినిధులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంతేజర్గంజ్ సిఐ మల్లేష్ యాద వ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు చిన్న వడ్డేపల్లి చెరువు సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కేటాయించినట్లు తెలిపారు. కానీ ఇటీవల ఉత్సవాల నిర్వహణకు కేటాయించిన స్థలంలో గుడిసెలు వెలిశాయని వాటిని తొలగించి తిరిగి మాకు స్థలా న్ని అప్పగించాలని కోరారు. సీఐని కలిసిన వారిలో కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ప్రతినిధులు ధూపం సంపత్, సముద్రాల పరమే శ్వర్, బయ్య స్వామి, గుండేటి నరేంద్ర కుమార్, ఓని భాస్కర్, గుల్లపల్లి రాజ్ కుమా ర్, గోరంట్ల మనోహర్, చిలువేరు శ్రీనివాస్, గుత్తికొండ నవీన్, ఓం ప్రకాష్ కొలారియా, శ్రీని వాస్, రాజు, నాగరాజు, యాదగిరి, రఘునారెడ్డి, గంగాధర్, సుధాకర్, తదితరులు ఉన్నారు.