Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ రచయిత రాజచంద్రమౌళి
నవతెలంగాణ-మట్టెవాడ
కుల గనన తోనే బిసి లకు సామాజిక న్యాయం జరుగు తుందని జనాభా గణన సెన్సెస్ లో బీసీల అంశాన్ని చేర్చాల ని ప్రముఖ రచయిత రామచంద్రమౌళి డిమాండ్ చేశారు. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమం జనాభా గణన సెన్సెస్ లో బీసీల అంశాన్ని చేర్చాలని దేశవ్యాప్త కోటి ఉత్త రాల ఉద్యమ కార్యక్రమం లో భాగంగా మంగళవారం కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కళాశాలకు వెళ్లే వైద్య విద్యార్థులు, డాక్టర్లతో ప్రధానమంత్రి కి ఉత్తరాలు రాయించి పోస్ట్ డబ్బాలో వేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రచయిత మాట్లాడుతూ బీసీల లెక్క తేలితేనే రాజ్యాంగపరంగా మాకు రావాల్సిన హక్కు సంక్రమించబడుతుందని, అందుకే ఒక సామాజిక బాధ్యతగా, ఉద్యమ రూపంలో ప్రధానమంత్రి దివ్య సన్నిధికి మన సవినయ విన్నపం-దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమమని అన్నారు.రాజ్యాంగం ప్రకారంమేము ఎంతో మాకు అంత అనే నినాదాన్ని బలంగా వినిపిస్తూ బిసి ల ఆకాంక్షను తెలియజేస్తున్నామని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలు లెక్కలు తీస్తారు, అడవిలో జరిగే పులులని అడుగులను బట్టి లెక్కలేస్తారు. రోడ్డున పెరిగే చెట్లను లెక్కిస్తారు. రోడ్డుపై తిరుగుతున్న పశువులకు కూడా వాటి సంఖ్యా నెంబర్లను ఇస్తారు. మరి బీసీలకు లెక్కలు వేయరా బి సి లు ఆంట్టే రాజకీయ పార్టీలకు భయమా,చులకన లేక నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్, డాక్టర్ శివుడు, డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ జోసెఫ్, డాక్టర్ నాగమణి, సుమలత, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.