Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి
నవతెలంగాణ-నెక్కొండరూరల్
విద్యారంగంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్టియు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఆదర్శపాఠశాల, రెడ్లవాడ, నెక్కొండ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం పిఆర్టియు మండల అధ్యక్షులు మాలోతు ప్రతాప్ సింగ్, ప్రధాన కార్యదర్శి కర్ర యాకుబ్ రెడ్డి అధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సభ్యత్వ నమోదు ముఖ్య అతిథిగా పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు పింగిళి శ్రీపాల్రెడ్డి హాజరైన కార్యక్రమంలో టిపిటీఎఫ్, టిపియుఎస్, యూటీ ఎఫ్ నుంచి టి. ప్రసాద్, కూరాకుల రాజు, జుమ్మి లాల్లులు పిఆర్టీయూలో చేరి సభ్యత్వం తీసకున్నారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ పిఆర్టియు సభ్యులకే కాకుం డా ఇతర సంఘ సభ్యుల సమస్య పరిష్కారంలో ఎనలేని కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈదునూరి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సామల పట్టాభి, నెక్కొండ మండల అధ్యక్షులు మాలోతు ప్రతాప్ సింగ్, ప్రధాన కార్యదర్శి కర్ర యాకుబ్ రెడ్డి, రాష్ట్ర అసోసి యేట్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పిజి హెచ్ఎంలు రత్నమాల, సజన్ తేజ, శ్రీధర్, రంగారావు, జ్యోతి లక్ష్మి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయశ్రీ, పర్వతగిరి మండల అధ్యక్షులు భూక్యా రాములు, రాష్ట్ర బాధ్యులు యుగేందర్, పాల్గొన్నారు.