Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌లో కిరికిరి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి :
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) నియోజక వర్గ కాంగ్రెస్‌లో ఆశావహులు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సింగాపురం ఇందిరా ఈసారి సికింద్రాబాద్ కంటో న్మెంట్ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ అడుగుతున్నట్లు సమా చారం. అంతేకాకుండా వరంగల్ లోక్‌సభ నుండి పోటీ చేయడానికి సైతం ఆమె సిద్ధంగా వున్నారని తెలుస్తుంది. ఇదిలావుంటే తాజాగా నియోజకవర్గం నుండి సింగాపురం ఇందిరాతోపాటు మాజీ పోలిసు అధికారి దొమ్మాటి సాంబయ్య పిసిసి సభ్యులుగా అధిష్టానం ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ నాదేనన్న ధీమాలో 'దొమ్మాటి' వున్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈసారి టికెట్‌పై 'దొమ్మాటి' ధీమాతో వున్నారు. ఇదిలావుంటే డాక్టర్ బొల్లపల్లి కృష్ణ కూడా పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నియోజకవర్గం నుండి పిసిసి సభ్యులుగా సింగాపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య ఎంపికయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్య ర్థిగా ఇందిర పోటీ చేసి ఓడిపోయాక నియోజకవర్గాన్ని పట్టించు కోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని సానుకూలంగా మలుచుకోవడానికి మాజీ పోలీసు అధికారి దొమ్మాటి సాంబయ్య రంగంలోకి దిగారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డితోపాటు 'దొమ్మాటి' కాంగ్రెస్‌లో చేరడం కలిసొచ్చింది. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై 'దొమ్మాటి' విశ్వాసంతో వున్నా రు. సింగాపురం ఇందిరా నియోజకవర్గానికి రాకపోవడంతో స్థాని కులు కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పలువు రు అభ్యర్థులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా రఘునా ధపల్లి మండలం కోమల్ల గ్రామానికి చెందిన డాక్టర్ బొల్లపల్లి క్రిష్ణ కూడా పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో పార్టీ పెద్దలతో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టిడిపి అభ్యర్థి గా దొమ్మాటి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజ కవర్గంతో క్షేత్రస్థా యిలో 'దొమ్మాటి'కి మంచి సంబంధాలున్నాయి. దీంతో ఈసారి ఇక్కడి నుండి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
'సింగాపురం' అటా.. ఇటా..?
పిసిసి సభ్యురాలు సింగాపురం ఇందిరా వచ్చే ఎన్నికల్లో సికిం ద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్నా శిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో పార్టీకి సానుకూలమైన వాతావరణం వుందని భావిస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తే విజయం సాధించొచ్చని భావి స్తున్నారు. వరంగల్ లోక్‌సభ స్థానం బరిలో దిగే అవకాశమొచ్చిన పోటీ చేయాలని 'సింగాపురం' భావిస్తున్నట్లు సమాచారం. మహిళా కోటాలో వరంగల్ లోక్‌సభకు పార్టీ టికెట్ ఇచ్చినా పోటీ చేయ డానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
'దొమ్మాటి' ధీమా..
'స్టేషన్' కాంగ్రెస్ టికెట్‌పై పిసిసి సభ్యుడు దొమ్మాటి సాంబయ్య విశ్వాసంతో వున్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో నియోజకవర్గంలోని పార్టీ నేతలు సైతం 'దొమ్మాటి'కి టచ్‌లో వుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే స్థానికేతరుడనే కోణంలో పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం హల్చల్ చేస్తున్నారు.
ఇందులో రఘునాథపల్లి మండలం కోమలకు చెందిన డాక్టర్ కృష్ణతోపాటు గంగారపు అమృతరావు వున్నారు. పిసిసి పదవుల కోసం వీరు తీవ్రంగా ప్రయత్నించినా దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం వీరంతా తీవ్రంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎవరికివారే రాజధాని కేంద్రంగా ప్రయత్నాలు తారాస్థాయిలో చేయడం పార్టీ శ్రేణుల్లో సర్వత్రా చర్చకు దారితీసింది. 'దొమ్మాటి' టిపిసిసి అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు కావడంతో పార్టీ టికెట్ ఆయనకే దక్కే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఏదమైనా 'స్టేషన్' కాంగ్రెస్ రాజకీయాలు ఆద్యంతం ఆసక్తికరంగా మారాయి.