Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి
నవతెలంగాణ-ఖానాపురం
జిల్లాలో ఉన్న పోడు భూముల సర్వే నిమిత్తం గ్రామాల వారీగా నియమించిన ఎఫ్ఆర్సి కమిటీలు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పోడు భూముల సర్వే చేపట్టా లని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే పోడు భూముల సర్వేలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని కీర్యా తండ గ్రామ పరిధిలో జరిగే పోడు భూముల సర్వేలో క్షేత్రస్థాయిలో పాల్గొని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నర్సంపేట నియోజక వర్గం లో ఖానాపురం మండలంలో పోడు ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన రెండు వారాలలో సర్వే పూర్తి చేయా లని అన్నారు. సర్వే కు సంబంధించి పలు అధికారులను నియమించామని, ఇంకా అవసరమైతే సర్వేకి అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. అటవీ హక్కులు 2005 చట్టం ప్రకారం దరఖా స్తుదారుడు మూడు తరాల ముందు నుండి భూమి సాగు చేసుకునే వారిని మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, గిరిజనులు, గిరిజనేతరులు వారికి సంబంధించి ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, పెద్దమనుషుల వాగ్మూలం 2005 సంవ త్సరం కన్నా ముందు ఉన్న ఆధారాలతోనే దరఖాస్తుదారు భూమిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో ఉన్న రైతులను సర్వే విధానాన్ని అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆర్ఓఎఫ్ఆర్ రికార్డులను పరిశీలిం చారు. ఆర్ఓఎఫ్ఆర్ లో సర్వే చేసిన భూములకు శాశ్వత పట్టాలు కావాలని, పోడు భూమల రైతులకు రైతుబంధు వర్తింపచేయాలని కీర్య తండ సర్పంచ్ హట్య అడగగా, కలె క్టర్ స్పందించి ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం పోడు భూముల రైతులు జీవనోపాధి నిమిత్తం సాగు చేసు కోవాలని, అటవీ శాఖ నుండి కేవలం హక్కు పత్రాలు మాత్ర మే ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, డిఆర్డిఓ సంపత్ రావు, ఇంచార్జ్ ఆర్డీవో మహేం దర్, ఎంపీడీవో సుమనవాని, తహసిల్దార్ సుభాషిని, ఎంప ీపీ వేములపల్లి ప్రకాష్ రావు, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.