Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాల్‌కు రూ.90 వేలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
మిర్చి ధర బంగారాన్ని మించేసింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం ఆల్ టైం రికార్డు ధర పలికి మిర్చి రైతుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన మోహన్‌రావు రైతు 11 బస్తాలు దేశీ రకం మిర్చి తీసుకురాగా విజయదుర్గ ట్రేడర్స్ అడ్తి ద్వారా నందిని చిల్లీస్ ఖరీదు దారు అత్యధిక ధర రూ.90,000 పెట్టి కొనుగోలు చేశాడు. మార్కెట్ కు మంగళవారం మొత్తం 500 బస్తాల మిర్చి లాగా అందులో తేజాలు 150 బస్తాలకు గరిష్ట ధర రూ.22,300, కనిష్టంగా రూ.18 వేలు పలికింది. వండర్ హార్ట్ 100 బస్తాలు రాగా గరిష్ట ధర 35,000 కనిష్ట ధర 26,000, యూఎస్341 120 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.29,000 కని ష్ట ధర రూ.21 వేలు, తాలు 100 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.8500 కనిష్ట ధర రూ.4000 గా పలికింది. మిర్చి ధర పైకి ఎగబాకుతూ లక్షకు చేరువలో ఉండటంతో మిర్చి రైతులలో ఎనలేని సంతోషం నెలకొంది.