Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియనా జెడ్ చోంగ్దు
- అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
నవతెలంగాణ-ములుగు/ఏటూరునాగారం టౌన్
ఏటూరునాగారంలోని కొమరం భీమ్ స్టేడియంలో మూడవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీ లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.మగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టియనా జెడ్ చోంగ్దు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు.ఆమెకు గిరిజన సాంప్ర దాయ నత్యాలు, స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు గౌరవ వందన సమర్పిస్తూ ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ ఎస్ కష్ణ ఆదిత్య, ఐటీడీఏ పిఓ అంకిత్ ఉట్నూర్ ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఏటూరు నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి ఆమె క్రీడా ప్రాంగణంలో వేదిక వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. క్రీడ మైదానంలో శాంతిక పోతాలను ఎగరవేశారు. పోటీలలో ఏటూరు నాగారం, భద్రాచలం , ఉట్నూరు ఐటిడిఏ లతోపాటు మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన క్రీడాకారులు సుమారు 1571 మంది మూడు రోజులలో హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియ నా జడ్ చొంగ్ధు క్రీడాకారుల నుంచి వందనం స్వీ కరించి క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భద్రాచలంలో సొసైటీ మీట్ ఉంటుందని ఇందులో పాల్గొ నేందుకు క్రీడాకారులు ఎంపిక కావాలని సూచించారు.మానసిక శారీరక దఢత్వంతో పాటు పట్టుదలతో ముందుకు సాగి క్రీడల్లో రాణించాలని ఆమె కోరారు.క్రీడాకారులు క్రమశిక్షణ అలవర్చుకోని జీవితంలో ఎంతో కీర్తి సంపాదించాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శారీరక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయాని ఆమె పేర్కొన్నారు.క్రీడలు క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని క్రీడలు పునాది వంటివని ఆమె పేర్కొన్నారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసిన అధికారులను ఆమె ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో కంటే క్రీడాకారులలో మంచి ఉత్సాహం కనిపిస్తుందని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డ్రస్సులు, బుట్లు అందజేశామన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి విజయం సాధించాలని కోరారు. క్రీడాకారులు మనసుపెట్టి ఆడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీడీలు పోచం, మంకిడి ఎర్రయ్య, జహీరుద్దీన్, ప్రేమకళ, ఎంపీపీ అంతటి విజయ, జడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలియోబి, సర్పంచ్ ఈసం రామ్మూర్తి పిఇటిలు ఐటీడీఏ సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.