Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశానికి 17 మంది కార్పొరేటర్లు గైర్హాజర్
- 3 ఎజెండాలు ఏకగ్రీవంగా తీర్మానం
- మీడియా కు అనుమతి ఇవ్వాలన్న బిజెపి కార్పొరేటర్ల నిరసన
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో బల్దియ మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొదటగా బిజెపి కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించాలని ప్లేకారులతో నిరసన వ్యక్తం చేశారు అనంతరం సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
ఆమోదితమైన మూడు అజెండా అంశాలు.
ఈ సర్వసభ్య సమావేశంలో మూడు అజెండా అంశాలు ఆమోదితమయ్యాయి. వాటిలో ప్రజారోగ్యం విభాగం స్వచ్ఛ ఆటో డ్రైవర్ కం ఓనర్ పథకం 163 స్వచ్ఛ ఆటో లకు జులై 2022 నుండి డిసెంబర్ 2022 కాలానికి ఈ ఎం ఐ చెల్లించుటకు అంచ నా విలువ రూ.71,31,960 చెల్లించుటకు ఆమోదమైంది. ట్రాక్టర్ ఫై పాశుద్ధ్య విధులు నిర్వర్తిస్తుండగా గుండె నొప్పితో మట్టెడ అశోక్ ఇటీవల మరణించారు. వారి కుటుంబ పోషణకై రూ.1 లక్ష, సాధారణ నిధుల నుండి మతుడి భార్య వనితకు చెల్లించడానికి కౌన్సిల్ తీర్మానం చేశారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియం ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న బ్యాడ్మింటన్ కోచ్ కాలపరిమితి 2023 మే నెల వరకు పొడిగించుట కౌన్సిల్ ఆమోదం చేశారు.
17 మంది కార్పొరేటర్లు గైర్హాజర్
వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో 66 డివిజన్ల కార్పొరేటర్లలో 49 మంది కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశానికి హాజరు కాగా, అందులో 17 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమోదితమైన పనులు ఇంతవరకు టెండర్ దశే పూర్తికాక కొన్ని పనులు కనీసం ప్రారం భానికి నోచుకోకపోవడం వలన పలువురు కార్పొరేటర్లు ఈ సర్వ సభ్య సమా వేశానికి రావడానికి నిరాసక్తి చూపుతున్నామని కార్పొ రేటర్లు బహిర్గతంగా చెప్పటం గమనహర్వం. మహానగరంలో కుక్క లు, పందులు, కోతుల బెడద తీవ్రంగా ఉందనీ, మిషన్ భగీరథ పె ౖపుల లీకేజీల పై అధికారులు శ్రద్ధ వహించాలని, సిసి రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు ప్రత్యే కంగా చర్యలు చేపట్టాలని కొంతమంది కార్పోరేటర్లు అధికారులను నిలదీశారు.
డీజిల్ దొంగల పై చర్యలు లేనట్టేనా?
- అధికారుల నిలదీసిన కార్పొరేటర్ స్వాతి
బల్దియాలో డీజిల్ దొంగలు అని నవ తెలంగాణ పత్రికలో వెలువడిన అనంతరం కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని విచారణ అధికారితో విచారణ చేపట్టి ఒకరిని సస్పెం డ్ చేశారు. మరో ముగ్గురిని బదిలీ చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు బదిలీ చేయడం లేదని అందులో అధికారులు వారిని తప్పించే ప్రయత్నం చేస్తు న్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని 52వ డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి అధికారులను నిలదీశారు.
ఓరుగల్లు విశ్వ వ్యాప్త నగరంగా గుర్తింపు
- బల్దియ మేయర్ గుండు సుధారాణి
ఓరుగల్లు భారత దేశ ఉత్తర వారసత్వ నగరంగా పేరు ప్రఖ్యాతలు సాధించింది. బల్దియాకు స్వచ్ఛ సర్వేక్షన్ లో నగరానికి ఉత్తమ ర్యాంక్ , ఓ డి ఎఫ్ ప్లస్2 లో హట్రిక్ సాధించింది. ఓరుగల్లు నగరానికి విశ్వ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. వరంగల్ నగరం ఎంపికవడం ఆనందంగా ఉంది.
సమావేశానికి గైర్హాజరైన కార్పొరేటర్లు
లావుడ్య రవి, బొంగు అశోక్, పోతుల శ్రీమన్నారాయణ, చెన్నం మధుసూధన్, దేవరకొండ విజయలక్ష్మి, సురేష్ కుమార్ జోషి, ఆకులపల్లి మనోహర్, మొహ మ్మద్ ఫూరాన్, బస్వరాజు కుమారస్వామి, ఆడేపు స్వప్న, తేజస్విని రామ,బాలిన సురేష్, చింతాకుల అనిల్ కుమార్, గందె కల్పన, సర్తాజ్ బేగం, బోయి నపల్లి రంజిత్‌రావు, నల్ల స్వరూపరాణి.