Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతదేశ అంబాసిడర్లు సురేష్ కె.రెడ్డి, ఎం.సుబ్బరాయుడు, అబ్బగాని రాము
నవతెలంగాణ-భూపాలపల్లి
విదేశాలలో డిమాండ్ ఉన్న వస్తువులు తయారుచేసి ఎగుమతి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే దిశగా అధికారులు కృషి చేయాలని దీనికి తమ వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని భారత దేశ అంబాసిడర్లు సురేష్ కె.రెడ్డి, ఎం.సుబ్బరాయిడు, అబ్బగాని రాము తెలిపారు. మంగళవారం ఇరాన్, బ్రెజిల్, పెరు, డెమొక్రటిక్ రిపబ్లిక్ దేశాల్లో పనిచేస్తున్న భారతదేశ అంబాసిడర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. అస్పిరేషనల్ జిల్లాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపడుతున్న పనుల గురించి కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర్, సంబంధిత అధికారులతో టి.ఎస్. జెన్కో గెస్ట్ హౌస్ సమా వేశ మందిరంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. నాణ్య మైన వస్తువులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందజే స్తామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ శాఖ కింద రైతులను ప్రత్యామ్నాయ పంటలైన చిరుధాన్యాలు, తస్సార్ సిల్క్ సాగు దిశగా ప్రోత్సహించడాన్ని అంబాసిడర్లు అభినందించారు. చిరుధాన్యాలు ప్రోత్సాహాకానికి జిల్లాకు కేటాయించిన రూ.1.36 కోట్లను సమర్థవంతంగా వినియోగిస్తూ 1000 ఎకరాల్లో చిరుధాన్యాలు ప్రణాళికలు తయారు చేశామని, చిరు ధాన్యాలతో బిస్కెట్లు, స్వీట్లు తయారు చేసి స్థానిక అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు సరఫరా చేస్తామని కలెక్టర్ తెలిపారు. అక్కడ నుండి వచ్చిన ఫలితాల ఆధారంగా మార్కెట్లలో విక్రయానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహాదేవపూర్ మండలంలో తస్సార్ సిల్క్ సాగును లివన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాజెక్ట్లి కింద ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సిల్క్‌తో పట్టు బట్టలు తయారు చేసే అవకాశాలు పరిశీలించాలని, విదేశాలలో బాగా డిమాండ్ ఉందని పేర్కొ న్నారు. రూ.10 కోట్ల నిధులతో ములుగు జిల్లాలో 117 అంగన్వాడీ కేంద్రాలు, జయశంకర్ జిల్లాలోని 117 అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, పిల్లలకు ఆట వస్తువులను ఏర్పాటు చేసి ప్రి స్కూల్ కు ధీటుగా తీర్చి దిద్దుతామని కలెక్టర్ అన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ చిట్యాల, మైనారిటీ గురుకుల పాఠశాల భూపాలపల్లి, కేజీబీవీ పాఠశాల విద్యార్డులలో 50 మందిని ఎంపిక చేసి ఐఐటి, నీట్ శిక్షణను బైజుస్ సమన్వయంతో అందజేస్తు న్నామని కలెక్టర్ పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలో నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై భారతదేశ అంబాసిడర్లు సంతప్తి వ్యక్తం చేసి అధికారులను అభినందించారు. అనంతరం తస్సార సిల్క్ నేత కార్మికులతో అంబాసిడర్ లు సమావేశమై వారు ఏర్పాటుచేసిన పట్టు దారం తయారీ యంత్రాన్ని పరిశీలించారు. విదేశీ ఎగుమతి స్థాయి నాణ్యమైన బట్ట వివిధ డిజైన్లలో తయారీకి కషి చేయాలని సూచించారు.
అనంతరం భూపాలపల్లి లోని ఘనపూర్ మండలం చెల్పురు గ్రామంలో పల్లె ప్రకతి వ నం, మన ఊరు మన బడి కింద చేపట్టిన జడ్పి ఉన్నత పాఠ శాలలో డిజిటల్ క్లాస్ రూమ్‌లను , అంగన్వాడి కేంద్రాన్ని, చెల్పూర్ లో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని అంబాసిడర్ లు పరి శీలించి సరదా గా యువకులతో వాలీ బాల్ ఆటను ఆడారు. జిల్లాలో చేపడుతున్న పనులు చాలా బాగున్నాయని అధికా రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, నీతి అయోగ్ రీసెర్చ్ స్కాలర్లు, జిల్లా గ్రామీ ణ అభివృద్ధి అధికారి పురుషోత్తం, సిపిఓ శామ్యూల్, డిపిఓ ఆశాలత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.