Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు
- కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సందర్శన
- విద్యుత్ సరఫరాకు నూతన సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ-సంగెం
తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ ను అంత రాయం లేకుండా అందిస్తున్నామని, అదే మాదిరిగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులోని పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్ ట్రాన్స్ కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం ఎన్పీడీసీఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు, టిఎస్ఐఐసి ఎండి నరసింహరెడ్డితో కలిసి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో నెలకొల్పుతున్న గణేష్ ఏకోపేట్, కైటెక్స్ కం పెనీ, కొరియాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం పవర్ ప్రజెంటేషన్‌లో వివరిస్తూ వాటి కి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో అనేక కంపెనీల స్థాపన జరుగుతున్నందున విద్యుత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా 220/132/33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్లను నెలకొల్పడానికి 10 ఎకరాల విస్తీర్ణం గల భూమిని కేటాయించామన్నారు. గతంలో ఉన్న 33/11 కెవి సబ్ స్టేషన్‌ను సామర్థ్యాన్ని పెంచుతూ 14 కోట్లతో అబివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో టెక్స్టైల్ పార్కును అబివృద్ధి చేస్తున్నారని ఆయన ఆదేశం మేరకే విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేస్తున్నా మ న్నారు ఈ విషయమై పలు కంపెనీల అధికారులతో యజ మానులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అనం తరం కొత్త సబ్ స్టేషన్‌కి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్ అధికారులు పలు పరిశ్రమల అధికారులు తదితరులు పాల్గొన్నారు.