Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం విద్యుత్ రంగంలో గణనీయమైన అభివద్ధి సాధించడం జరి గిందని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. తెలం గాణ రాష్ట్రంలో టీఎస్ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లుగా నియమి తులు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. మం గళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎస్ఎన్పీడీసీఎల్లో నూత నంగా రిక్రూట్ అయిన అసిస్టెంట్ ఇంజనీర్లతో కలెక్ట ర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఏఈలకు వారి వత్తి ధర్మం పట్ల దిశా నిర్దేశం చేశారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు జరిగి గణనీయమైన అభివద్ధి సాధించామని రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిరంతరాయంగా 24 గంటలు విద్యుత్ సరఫరా అం దిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధిచెందిం దన్నా రు. తాము చేసే వత్తికి న్యాయం చేయాలని అందరూ ఇష్టపడేలా వత్తి ధర్మాన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ జవాబుదారితనంగా ఉండాలని కొత్త ఏ ఈలకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో వివిధ శాఖల్లో మహిళా అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని నూతనంగా రిక్రూట్ అయిన మహిళ అసిస్టెంట్ ఇం జనీర్లు తమపై స్థాయి అధికారులతో తమ సందేహా లను నివత్తి చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. తమకు లభించిన అవకాశాలను, వనరులను వినియోగించుకొని ఉత్తమ సేవలు అం దించడం ద్వారా తమను తాము నిరూపించుకునే అ వకాశం లభించిందని కలెక్టర్ అన్నారు.
నూతనంగా రిక్రూట్ అయిన అసిస్టెంట్ ఇంజనీర్ల శిక్షణకు సంబంధించిన మెటీరియల్ ను క లెక్టర్ ఏఈలకు అందజేశారు. ఈ సమావేశంలో టీ ఎస్ఎన్పీడీసీఎల్ పర్యవేక్ష ఇంజనీర్ జె.నరేష్, డిఈ లు శ్రీధరాచారీ, సునీతాదేవి, సీనియర్ అకౌంట్స్ ఆఫీ సర్ అనిల్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.