Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయా లని కోరుతూ భారత ప్రజాతం త్ర యువజన సమైక్య (డివై ఎఫ్ఐ) ఆధ్వర్యంలో హాసన్ పర్తి మండల తహసీల్దార్ కా ర్యాలయం ముందు ధర్నా ని ర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు మంద సుచందర్ మాట్లాడారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగి పోతుందని, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ గాక నిరుద్యో గులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం మూసివేస్తూ, చేతులు ఎత్తేస్తుందని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం, ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తుందని మదిపడ్డారు. ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ సెంటిమెంట్ యువతను ప్రభుత్వంపై ప్రశ్నిం చకుండా చేస్తుందన్నారు. యువతకు ఉపాధి లేకపోవడంతో, నిరుద్యోగులుగా కాలం వెళ్ళదిస్తున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్ పై ప్రభుత్వం నిర్లక్ష్యం నిరసిస్తూ డి వైఎఫ్ఐ ఆధ్వర్యంలో నవంబర్ 3న పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్నామని యువ త కదిలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు కుర్ర హర్ష, మండల కార్యదర్శి వేలు సుమన్, మౌనిక, రమేష్, తిరుపతి, చందు పాల్గొన్నారు.