Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి భ యంతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ బిజెపిపై దుష్ప్రచారం చేస్తున్నారని బిజెపి మండల అధ్యక్షులు గడ్డం రమేష్ వి మర్శించారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ విసిరినటువంటి సవాలను సీఎం కేసీఆర్ స్వీకరించ కుం డా, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్నారు. పత్రికా సమావేశంలో సమాధానం చెప్తానని కాలయాపన చేస్తున్నాడని, మునుగోడులో బిజెపి గెలుపు ను ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. అధికార పార్టీ యంత్రాంగం ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మునుగోడు ప్రజలు, తెలంగాణ ప్రజలు నీ మాటలు నమ్మే రోజులు పోయాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహ నం చేయడం సంస్కారం లేని హీనమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం లో నాయకులు బాసాని విద్యాసాగర్, ఉప్పురాజు, కొత్తపల్లి శ్రీకాంత్, మామిడి విజరు,కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, కొడపాక సంజీవరావు, మేకల సుమన్ తదితరులు పాల్గొన్నారు.