Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు ముమ్మిడి శ్రీకాంత్
నవతెలంగాణ-ధర్మసాగర్
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించా లని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్ ) జిల్లా కన్వీనర్ చుక్కయ్య నాయకులు బండి పర్వతాలు ముమ్మిడి శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ధర్మసాగర్ మండల మహాసభ బొ ల్లం సాంబరాజు అధ్యక్షత జరిగింది. ఈ మహాసభకు జిల్లా నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో గతంలో 150 కొనుగోలు కేంద్రాలు ఉండేవి,ఇప్పుడు కనీసం 200 నుంచి 250 వరకు కేంద్రాలను ఏర్పాటు చేయాల ని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి పంట నష్టపరిహారాన్ని వెంటనే అందించడంతో పాటు పండిన పంటకు కనీసం మద్దతు ధరను రూ.3 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మక్కజొ న్నలు, పత్తిని ప్రభుత్వమే కొనుగొలు చేయాలన్నారు. ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో తీవ్రనష్టం వాటిల్లిందని ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం పత్తికి క్విం టాకి 15000 పాటు మక్కలకి 3వేలు మద్దతు దర ఇవ్వాలని ప్రభుత్వాలను డి మాండ్ చేశారు.ధరణి ద్వారా తీసుకువచ్చిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసిల్దార్ మర్కాల రజినికి వినతి పత్రాన్ని సమర్పించారు.
అనంతరం ధర్మసాగర్ రైతు సంఘం నూతన మండల కమిటీని 15మంది తో ఎన్నుకున్నారు.మండల కన్వీనర్ గా బొల్లం సాంబరాజు, కో కన్వీనర్ గా మే కల రోహిత్, శ్రీనివాస్ లను నియమించారు. మిగత 13మందిని కమిటీ సభ్యు లుగా నియమించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,రఘు,శేఖర్, రోహిత్, భాగ్య మ్మ, చిలుక రాఘవులు, వెంకటయ్య తదితరులు పాల్గొని పాల్గొన్నారు.