Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ హన్మ కొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసిధర్నా నిర్వహించారు. అ నంతరం జిల్లాకలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శి మంద శ్రీకాంత్, మిస్రీన్ సుల్తానా మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించా రు. రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల మూడు వేల కోట్ల స్కా లర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగు లో ఉన్నా యన్నారు. హాస్టల్స్ కు సొంత భవనాలు లేకపోవడం తో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.అధికమైన బస్సు పాసుల ధరలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం నిర్వహిం చిన సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఫీజు కంటే అదనంగా డ బ్బులు వసూలు చేస్తున్నారన్నారు. పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం మంచినీళ్లు,మౌళిక స దుపాయాలు లేవన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు వి చ్చలవిడిగా ఫీజుల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో జిల్లా కేంద్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమ స్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ స భ్యులు మూలవేణు, స్టాలిన్, అనూష, నవీన్, శ్రావణ్ ,మాధవ్ ,కార్తీక్, శిరీష ,ప్రవళిక ,రాజు, గణేష్, మాన స తదితరులు పాల్గొన్నారు.