Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-హసన్పర్తి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ అ మలు చేస్తున్న కార్మికవ్యతిరేక విధానాలను ప్రతీ ఒక్క రు వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రా గుల రమేష్ పిలుపునిచ్చారు.శుక్రవారం సీఐటీయూ హసన్పర్తి మండల విస్తృతస్థాయిసమావేశం కనుక స్వామి అధ్యక్షతన ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వ హించగా రమేష్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదే ళ్ల పరిపాలనలో ప్రజల మీద భారం వేసి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సా మాన్యుల నడ్డి విడిచిందని ఆయన విమర్శించారు. 44కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో యాజమాన్యాలకు అనుకూల మైన నాలుగు కార్మిక కోడులను తీసుకువచ్చిందని తక్షణమే వాటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా తన మిత్రులకి అమ్ముతూ ప్రజా సంపదని లూటీ చేస్తు న్నారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో మతాల ప్రాతిపదికన ప్రజల్ని విభజిస్తూ మత ఘర్షణలను పెంచుతూ ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారని దీనిపైన ప్రజలు అప్రమత్తంగా ఉంటూ బీజేపీ మతోన్మాద వి ధానాలను తిప్పికొట్టాలని కార్మిక వర్గానికి ఆయన పి లుపునిచ్చారు. తన స్వార్థం కోసం 18 వేల కోట్ల రూపాయల ప్యాకేజీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని బీజేపీని మునుగోడు ఎన్నికల్లో కార్మిక వర్గం ప్రజలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు అసం ఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఆటో కార్మికులకు రూ.1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ మండల కమిటీ ఎన్నిక
సీఐటీయూ మండల సమన్వయ కమిటీ ని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సిఐటియు కన్వీన ర్గా పుల్ల అశోక్, కమిటీ సభ్యులుగా ఓపరాజు కనుక స్వామి, షబ్బీర్, సదాలక్ష్మి, పల్లం సమ్మయ్య, లక్ష్మణ్, పున్నం, చారి, స్వామిలు ఎన్నికయ్యారు.