Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూల సింగిడిగా సీతంపేట గంగమ్మ ఒడికి చేరిన గౌరమ్మ
- మూడవ రోజు బతుకమ్మల నిమజ్జనం
నవతెలంగాణ-హసన్పర్తి
తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక్క సీతంపేటలో వినూత్న రీతిలో మూడు రో జుల పాటు నిర్వహించే నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ వేడుకలు శుక్రవారం వైభవంగా ముగిసాయి. మొదటి రోజు బుధవారం కేదారీశ్వరీస్వామి వ్రత కల్పంతో మొదలై, రెండవ రోజు జోడెద్దల నిమజ్జనం, మూడవ నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ వేడుకలు బతుకమ్మ నిమజ్జనంతో శుక్రవారం మూడవ రోజు సంబురంగా ముగిసాయి. నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ వేడుకల్లో భాగం గా శుక్రవారం మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ఊరు శివారులోని పెద్ద చె రువు కట్టకు చేరుకున్నారు. పురుషులు కోలాటాలతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ డీజే సౌండ్ల మద్య బతుకమ్మ ఊరేగింపు కొనసాగింది. దీంతో సీతంపేట పూల సింగిడిగా మారింది. మహిళలు చెరువు కట్ట వద్ద బతుకమ్మ చుట్టు తిరుగు తూ బతుకమ్మ పాటలు పాడి సంబురంగా గడిపారు. మహిళలు పసుపు, కుంకు మలతో చేసిన గౌరమ్మను ప్రత్యేకంగా పూజించి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, పాడిపంటలు దండిగా పండాలని, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో జీవించాలని గౌరమ్మను వేడుకున్నారు. అనంతరం బతుకమ్మలను పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. తి రుగు పయణంలో గంగ నీటిని తెచ్చి కేదారీశ్వరస్వామిని శుద్ది చేసి నోము ముందు కూర్చొని సుంకు పట్టి ఉపవాస దీక్షను విడిచారు. దీంతో నేతకాని కులస్తుల మూడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిసాయి.
ఈ పండుగకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిద రాష్ట్రాలలో, దేశా లలో స్థిరపడిన నేతకాని కులస్తులు సీతంపేటకు చేరుకొని ఈ వేడుకలలో పాల్గొ నడంతో పండుగ వాతావరణం తలపించింది.
నేతకాని కులస్తుల పండగ పట్ల వివక్ష
మూడు రోజుల పాటు సీతంపేటలో ప్రత్యేకంగా జరిగే నేతకాని కులస్తుల దీ పావళి బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వెచ్చించకపోవ డంపై నేతకాని కులస్తులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకున్న నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ వేడుకలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చివరి రోజు బతుక మ్మ వేడుకలకు కనీసఏర్పాట్లు చేయలేదని కులపెద్దలు మండిపడుతున్నారు. చెరు వులో బతుకమ్మలను నిమజ్జనం చేసే చోట కనీసం విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని మహిళలు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నా పాలకుల కు కనీస బాద్యత లేదని, పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల నేతకాని కులస్తుల పండగలపై వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని నేతకాని కుల స్తులు మదన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రతయేట నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని ఆ సంఘం నేతలు కోరుతున్నారు.