Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
- రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా
నవతెలంగాణ-జఫర్గడ్
మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, తమ నియోజకవర్గా ల్లోనూ ఉప ఎన్నిక వస్తే బాగుండేది అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జిల్లా కార్యదర్శి మాన్యపు బుజెందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే వచ్చింది కాదని, రాజగోపాల్ రెడ్డి స్వప్రయోజనాల కోసం, బీజేపీ అధికార దాహంతో వచ్చిందని ఆరోపిం చారు. బీజేపీ, టీఆర్ఎస్ అవకాశవాదంతో ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల్లో చీలిక తీసుకు వచ్చేం దుకు యత్నిస్తున్నారని, ప్రజలు గమనించాలని కోరారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను బలపరచాలని, వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక శక్తులను బలోపేతం చేయాలన్నారు.