Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పర్వతగిరి
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం లోకొచ్చి పదేండ్లు కావస్తున్నా అభివద్ధి మాత్రం శూన్యం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల దష్టిని మళ్లించడానికి బీజేపీ, టీఆరఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయన్నారు. 2014లో టిడిపి ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్లో కలుపు కోలేదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో గతంలో జరిగిన అభి వృద్ధి తప్పా, టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో పర్వతగిరిలో గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, రిజర్వాయర్ నిర్మాణం శాశ్వతంగా చేపట్టారన్నారు. ప్రస్తుతం సొంత లాభం, కాంట్రాక్టుల కోసమేనని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దళితుడై పర్వతగిరి లో ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. జనవరి 2023 వరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుంటే వచ్చే అంబేద్కర్ జయంతి వరకు తామె అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఇన్చార్జి నమిండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు తరలివెళ్లనున్నారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కూసం రామచంద్రు, సొసైటీ డైరెక్టర్ జూలపల్లి గంగాధర్ రావు, సీనియర్ నాయకులు రాఘవులు, రావూరు మాజీ సర్పంచ్ హేమ్లా నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.