Authorization
Tue March 04, 2025 11:04:57 am
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రేల నారాయణ రెడ్డి(85) శుక్రవారం ఆకాల మరణంపొందారు. ఆయన పార్ధీవ దేహానికి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు గుండెబోయిన నాగమణి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రేల నారాయణ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి, మండల ప్రజలకు తీరని లోటని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని కొనియడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య, టౌన్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ నాయకులు చాట్ల సంపత్, మండల మహిళ అధ్యక్షురాలు నిర్మల రెడ్డి, మధుకర్ రాజు, గంగవత్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.