Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయడమే లక్ష్యం..
- హరిపిరాల సర్పంచ్ రావుల మమతజగదీశ్వర్రెడ్డి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
'ప్రజల సహకారంతో గ్రామాభివద్ధికి నిరంతరం కషి చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయడమే మా కర్తవ్యం. నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో పరిష్కరించేలా కషిచేస్తాం. ప్రభుత్వ నిధులతో గ్రామాభివద్ధికి పాటుపడుతున్నాం.' అని హరిపిరాల గ్రామ సర్పంచ్ రావుల మమత జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె నవతెలంగాణ ముఖాముఖితో ముచ్చటించారు. వివరాలు ఆమె మాటల్లోనే...
నవతెలంగాణ : గ్రామ జనాభా, వార్డు మెంబర్లు.. గ్రామ అభివృద్ధి వివరాలు ?
సర్పంచ్ : గ్రామంలో దాదాపు 4117 జనాభా, 12 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి తడి పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశార. నర్సరీ, స్మశాన వాటిక, పార్క్, క్రీడా మైదానం, గ్రామంలో కోటి రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. రూ.13లక్షలతో హెల్త్ సెంటర్ నిర్మించాం. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. గ్రామంలో ఈజీఎస్ నిధులతో కలుపుకొని సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4కోట్ల మేర పనులు చేపట్టాం. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతో గ్రామపంచాయతీ వర్కర్స్ జీతాలు తీసేసి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ గుర్తించి పరిష్కరించి గ్రామాభివద్ధి పనులు చేపడుతున్నాం.
నవతెలంగాణ : రేషన్ కార్డులు, పెన్షన్లు
రానివారు ఉన్నారా?
సర్పంచ్: గ్రామంలో 887 మందికి పెన్షన్లు వస్తున్నాయి. 1278 రేషన్ కార్డులు ఉన్నాయి. ఎవరికి పెన్షన్లు, రేషన్ కార్డులు రావలసినవారు లేరు
నవతెలంగాణ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులతోపాటు రోజు వారి పనుల వివరాలు ?
సర్పంచ్: గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయలతో ప్రతి సంవత్సరం పనులు జరుగు తున్నాయి. ప్రతిరోజు గ్రామంలో వీధులను శుభ్రం చేయడం తడి పొడి చెత్త సేకరించడం పైప్ లైన్ లీకేజీ ఉన్న ప్రాంతంలో లీకేజీలకు మరమ్మతు పనులు చేయడం, సైడ్ కాలువలను శుభ్రం చేయడం, నెలలో ఒకసారి వాటర్ ట్యాంకులను కడగడం లాంటి పనులు చేస్తున్నాం.
నవతెలంగాణ: గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారానికి మీ కృషి ?
సర్పంచ్: గ్రామంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న చీకటాయపాలెం బీటీ రోడ్ల పనులు గుర్తించి వాటికి పనులు చేయించడం జరుగుతుంది. మన ఊరు మనబడి పథకంలో గ్రామంలో అదనపు గదుల నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. గ్రామంలో అభివద్ధి పనులు చేసిన వాటికి చాలా వరకు బిల్లులు వచ్చాయి. మిగతావి కూడా రావాల్సి ఉంది.
నవతెలంగాణ : రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో ఉంటారా?
సర్పంచ్: ఏకగ్రీవంగా హారిపిరాల గ్రామ ప్రజలు సర్పంచ్‌గా నన్ను ఎన్నుకున్నారు. గ్రామ ప్రజలు మళ్ళీ అలాగే కోరుకుంటే ప్రజలకు సేవ చేస్తా.. హరిపిరాల గ్రామ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావిస్తాను.