Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే కలెక్టరేట్ను ముట్టడిస్తాం
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడ రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూక్యచంద్రనాయక్ పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ కుంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిం చారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రైతులకు మద్దతు ధర రూ. 3000 ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్ కు రూ.2040 లు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం క్వింటాల్ ధాన్యానికి రూ.3వేలు ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా కేరళ ప్రభుత్వం రూ.800 ప్రకటించి క్వింటాల్ ధాన్యాన్ని రూ. 2850 లకు కొనుగోలు చేస్తోందన్నారు. కేరళ తరహాలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం వరి ధాన్యం చేతికొచ్చిందని, వరి కోతకు మిషిన్లు గంటకు రూ.2800 తీసుకుంటు న్నారన్నారు. కోత మిషన్ల రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. వరి కోత మిషన్లు అందుబాటులో లేకుంటే అధికార యంత్రాంగం అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలలో ధాన్యం తేమ శాతాన్ని 17 శాతంగా నిర్ణయించారని, కానీ అంతకు తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని కూడ మిల్లర్లు కొనుగోలుకు అంగీకరించడం లేదన్నారు. తేమ శాతం పేరుతో కొన్ని చోట్ల కొనుగోలుకు నిరాకరిస్తున్నారని అన్నారు. పైగా క్వింటాలుకు 5 నుండి 10 కిలోల వరకు తరుగు కింద ధాన్యం కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం మిల్లర్లు, కొను గోలు కేంద్రాలు ఇదే విధంగా రైతులను మోసం చేశార న్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పత్తి పంట వేసుకోవాలని చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి పంట వేసుకు న్నారన్నారు. కానీ అధిక వర్షాలతో పత్తి తక్కువ దిగుబడి వస్తుందన్నారు. దీనిని దష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.15000తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చిల్లర కాంటాదారుల ఆగడాలు ను అధికారులు అరికట్టాలని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ రవీందర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామవత్ మిట్యా నాయక్, సీనియర్ నాయకులు గురజాల లక్ష్మీ నరసింహ రెడ్డి, మండల నాయకులు దండబోయిన సికిందర్, కన్నెబోయిన బాలరాజు, యం. రామచిక్కం, కే జగన్ ఏ సత్తయ్య, బి సారయ్య, బాల్న వెంకటరాజు దండు అశోక్ మిద్దెపాకు పరశురాములు, గుగులోతు రాజు, భూక్య విజరు కాంత్, రామావత్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
జఫర్ గడ్ : జనగామ జిల్లాలలో అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేదంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య హెచ్చరించారు. మండ లంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ స్వప్నకు అందజేశారుే. అనంతరం నక్క యాకయ్య అధ్యక్ష తన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా కేరళ ప్రభుత్వం రూ.800 ప్రకటించి క్వింటాల్ ధాన్యాన్ని రూ.2850 లకు కొనుగోలు చేస్తోందన్నారు. కేరళ తరహాలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం మండల అధ్యక్షులు పిన్నింటి సమ్మయ్య, మహిళా సంఘం మండల కార్యదర్శి ఎం డి షబానా, రైతు సంఘం మండల నాయకులు ఎండి శంషుద్దీన్ , చొప్పరి వెంకటయ్య ,మొగుళ్ళ రాములు ,ఎర్ర రవీందర్, వడ్లకొండ సుధాకర్ ,నీరెడ్డి కొమరయ్య, వడ్లకొండ రాములు, కే నాగయ్య, సిహెచ్ మల్లేష్, సిహెచ్ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : మండలంలోని అన్ని గ్రామాలలో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని, కనీసం మద్దతు ధర 3000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం జనగామ మండల కమిటీ ఆధ్వర్యంలో శువ్రకారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రవీందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షులు పయ్యావుల బిక్షపతి మాట్లాడుతూ.. చిల్లర కాంట వ్యాపారస్తుల నుండి మార్కెట్ చైర్మన్ మరియు అధికారలు చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా చిల్లర కాంట దుకాణాలు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.